నెల్లూరులో కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ బస్సులు ప్రారంభించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని బస్సులను ప్రారంభించారు.
ఆక్సిజన్ బస్సులను ప్రారంభించిన మంత్రులు
నెల్లూరులో కొవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ బస్సులు నడపనున్నాయి. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వీటిని పలువురు మంత్రులు ప్రారంభించారు. అలాగే గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.
అనంతరం గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో మంత్రులు అనిల్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, కలెక్టర్ చక్రధర్ బాబు పర్యటించారు. చెన్నూరు ఎస్టీ కాలనీ సమీపంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి ట్రస్ట్ తరపున కొవిడ్ పాజిటివ్ రోగులకు మంత్రుల చేతుల మీదుగా హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు.
ఇదీ చదవండీ..శ్రీకాళహస్తిలో వెయ్యి పడకల కొవిడ్ తాత్కాలిక ఆసుపత్రి