Illegal layouts in Nellore Urban Development Corporation: నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్టవేయలేక పోతున్నారు. ఆదాయం పెంచలేక పోతున్నారు. నెల్లూరు గ్రామీణం, నగరం చుట్టూ 100కు పైగా లేఅవుట్లు ఉన్నాయి. కోట్ల రూపాయలు నుడాకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా అధికార పార్టీ నాయకులు కావడంతో నుడా అధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారు. 70శాతం లేఅవుట్లకు అనుమతులు లేవు. టీడీపీ, జనసేన, సీపీఎం నాయకులు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా స్పందించడంలేదు.
100కు పైగా అక్రమ లేఅవుట్లు..నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు ముడుపులు తీసుకుని అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోకుండా వదిలివేస్తున్నారని తెలుగు యువత నాయకులు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. నుడా అధికారి బాపిరెడ్డికి వారి అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ధర్నా చేసినా, నిరసన తెలిపినా అధికారుల్లో మార్పు రావడంలేదని తెలుగు యువత నాయకులు చెబుతున్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలో 100కుపైగా అక్రమ లేఅవుట్లు ఉన్నాయని. ప్రజలను మోసం చేసి అంకణం లక్షరూపాయలకుపైగా అమ్ముతున్నా నుడా అధికారులు పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు. చెత్తమీద పన్ను వేస్తే ఆదాయం ఎంత వస్తుందని,అధికార పార్టీ నాయకులు వేస్తున్న అక్రమ లేఅవుట్లపై పన్నులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధనలక్ష్మీపురం, నరుకూరు రోడ్డులో వేలాది ఎకరాల్లో ప్లాట్లు వేసి అనుమతులు లేకుండా అమ్మెస్తున్నారని చెప్పారు.