పశువుల్లో అరువుగా కనిపించే అతి భయంకరమైన వ్యాధి బ్రోసెల్లో సిస్ నెల్లూరు జిల్లాలో 30 పశువులకు సోకినట్లు నిర్దారణ అయింది. ఈ వ్యాధి సోకిన పశువులు జీవించడం కష్టమని పశువైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని కొండాపురం మండలంలోని చింతలదేవి మిశ్రమ పశుగణాభివృద్ధి క్షేత్రంలోని 131 పశువుల్లో 30పశువులకు సోకినట్లుగా రక్త పరీక్షల్లో నిర్దారణ అయింది. ఈ నెల 14వ తేదీన ఈ పశువులను వేలం వేయాల్సి ఉంది. మిగిలిన పశువుల రక్తనమూనాను ల్యాబ్ కు పింపించగా, వాటికి ఈ వ్యాధి లక్షణాలేవి కనిపించలేదని మిశ్రమ గణా అభివృద్ధి క్షేత్రం డీడీ వెంకట్ రామన్ తెలిపారు.
30 ఒంగోలు గిత్తలకు భయంకరమైన బ్రోసెల్లో సిస్ వ్యాధి - nellore
పశువుల్లో కనిపించే అతి భయంకరమైన బ్రోసెల్లో సిస్ వ్యాధి నెల్లూరు జిల్లాలో 30 ఒంగోలు గిత్తలకు సోకింది. దీంతో మిగిలిన పశువులకు ఈ వ్యాధి అంటుకోకుండా అధికార్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
![30 ఒంగోలు గిత్తలకు భయంకరమైన బ్రోసెల్లో సిస్ వ్యాధి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4121658-275-4121658-1565681626677.jpg)
ఒంగోలు గిత్తలకు బ్రోసెల్లో సిస్ వ్యాధి
TAGGED:
nellore