నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో రెండో విడత పోలింగ్ ఓటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఉదయం 6:30 గంటల నుంచి ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. నడవలేని వృద్ధులను పోలీసులు వీల్‌చైర్‌లో కూర్చో పెట్టి ఓటింగ్‌కి తీసుకెళ్తున్నారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలో 158 పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది.
నాయుడుపేట మండలం వేముగుంటపాళెం పంచాయతీ సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతా మహిళా పాలకవర్గం ఎంపిక చేసుకున్నారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీలో 1150 ఓట్లు ఉన్నాయి. స్థానికులు అందరూ ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. సర్పంచి సభ్యులు చేపట్టి.. గ్రామస్థులు మహిళ సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు.
ఉదయగిరి నియోజకవర్గంలో సీతారామపురం, వింజమూరు మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్ల అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉదయగిరి మండలంలో 8. 30 గంటలకు 14.52 శాతం పోలింగ్ నమోదైంది.
నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ పోలింగ్ - Ongoing voting process in Nellore district
నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. నడవలేని వృద్ధులను పోలీసులు వీల్‌చైర్‌లో కూర్చోపెట్టి ఓటింగ్‌కి తీసుకెళ్తున్నారు.
నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ పోలింగ్
మర్రిపాడు మండలం నందవరం గ్రామంలో షేక్ రహమతున్నీషా అనే మహిళా ఓటరు పోలింగ్ కేంద్రానికి భర్తతో కలిసి వెళ్లారు. ఓటు వేయటానికి అధికారుల దగ్గరకు వెళ్లగా.. మీ ఓటును మీరు వినియోగించుకున్నారని చెప్పటంతో.. ఆమె భర్తతో కలిసి పోలింగ్ కేంద్ర వద్ద నిరసనకు దిగారు. ఓటు వేయటానికి వెళ్లిన ఓ వ్యక్తి తన ఓటు ముందుగానే వేసి ఉండటంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: నేడు రాష్ట్రంలో రెండోదశ పంచాయతీ ఎన్నికలు
Last Updated : Feb 13, 2021, 2:02 PM IST