నెల్లూరు జిల్లా మనుబోలు మండలానికి చెందిన రామ్మోహన్ రెడ్డి తన భార్యకు పాజిటివ్ రావడంతో నగరంలోని మెడికవర్ హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ కింద చేర్చారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం తమవద్ద అదనంగా లక్ష నాలుగు వేల రూపాయలు వసూలు చేసిందని, దీనిపై విచారణ జరిపించాలని రామ్మోహన్ రెడ్డి జేసీకి ఫిర్యాదు చేశారు. కరోనా సమయంలో బాధితుల నుంచి అధిక మొత్తం వసూలు చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని జేసీ వెల్లడించారు.
ఆరోగ్యశ్రీకి అదనపు సొమ్ము వసూలు చేశారంటూ జేసీకి ఫిర్యాదు
ఆరోగ్యశ్రీ ద్వారా కొవిడ్ చికిత్స కోసం అదనపు సొమ్ము వసూలు చేశారని.. ఓ బాధితుడు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
collector