నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మొత్తలు దగ్గర ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మైపాడు నుంచి ఇందుకూరుపేట వైపు వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది.
ప్రమాద సమయంలో ఆటోలో ఐదుగురు ప్రయాణికులుండగా.. నరసాపురానికి చెందిన ఓ యువకుడు మరణించారు. మిగిలిన నలుగురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.