ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయ్యో పాపం అనేవారే... సాయం చేసేవారేరి..? - నెల్లూరులో మానవీయ కథనం న్యూస్

ఇద్దరు కొడుకులు, కోడళ్లు, ఒక్క కూతురు, ముగ్గురు చంటిపిల్లలు. ఇంత మందిని పోషించాలి. పని చేసేది ఒక్కరే. వాళ్ల కడుపు నిండాలని... ఆ తల్లి పస్తులుంటోంది. గూడైనా.. బాగుందా? అంటే ఫ్లేక్సిల నీడే. చలిలో నిద్రలేని రాత్రులు. ప్రపంచంలో ఏ తల్లికి రాని కష్టాలు ఆ మాతృమూర్తివి. అయ్యో పాపం అనకుండా... సాయం చేయాలనే తపనతో ఈ కథనం చదవండి.

అయ్యో పాపం అనేవారే.. సాయం చేసేవారేరి?
అయ్యో పాపం అనేవారే.. సాయం చేసేవారేరి?

By

Published : Dec 4, 2019, 11:11 PM IST

Updated : Dec 4, 2019, 11:58 PM IST

పెద్దకుమారుడికి గుండె ఆపరేషన్. కొడలు బాలింత. చిన్నకుమారుడు, కోడలుకు చెప్పుకోలేని వ్యాధి. మిగిలిన వారు చిన్నపిల్లలు. ఇంతమందిని పోషించాలంటే... ఎంత కష్టం చేయాలి..? ఒక్కరు సంపాదిస్తే సరిపోదు కదా.! ఈ కష్టాల కడలి దాటలేక.. మధ్యలో మునగ లేక ఆ తల్లి కన్నీటితో సాయం కోసం ఎదురుచూస్తోంది. ఒక్కరైనా సాయం చేయరా..? అని దీనంగా అర్థిస్తోంది. ఇప్పటి వరకూ ఈ ఇంటి వైపు చూసినవారంతా అయ్యో పాపం అన్నవారే. ఏ ఒక్కరూ ఎలాంటి సాయం చేయలేదు. 8 మందిని పోషించేందుకు తన రక్తాన్ని చెమటగా చిందిస్తోందీ ఆ మాతృమూర్తి.

ఉన్న పూరి గుడిసే పైకప్పు కూలిపోయింది. ఫ్లేక్సిల కిందే తలదాచుకుంటున్నారు.
నెల్లూరు నగరంలోని బోడిగాడితోట శ్మశానానికి సమీపంలో కామాక్షమ్మ ఇళ్లుంది. ఒక్కసారి ఆ ఇంటిని చూస్తే... పాపం ఏంటీ ఈ జీవితం అనిపిస్తుంది. దరిద్రం వారితో ఎలా ఆడుకుంటుందో అర్థమవుతోంది. శ్మశానం ఎదురుగా ఉన్న స్థలంలో కర్రలతో గూడు ఏర్పాటు చేసుకున్నారు కామాక్షమ్మ. బైట దొరికిన ప్లేక్సిలే ఇంటి పైకప్పు అయ్యాయి. ఏండాకాలం వేడి... వర్షకాలం నీరు... శీతకాలంలో చలి... వాళ్లతో సహవాసం చేస్తున్నాయి.

కామాక్షమ్మ భర్త పిల్లలు పుట్టాక చనిపోయాడు. ఇద్దరు కొడుకులు, ఎనిమిదేళ్ల కూతురు. ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేసింది. పెద్ద కుమారుడు వెంకటేశ్​కు గుండే ఆపరేషన్ అయ్యింది. బరువులు మోయకూడదు. వెంకటేశ్​కు ముగ్గురు చిన్నపిల్లలు. పిల్లలు చిన్నావారు కావడంతో పెద్ద కొడలు పనికి వెళ్లలేదు. రెండో కుమారుడు రంగయ్య. ఆయన భార్య గర్భవతి. ఇద్దరికీ చెప్పుకోలేని వ్యాధి సోకిందని చెబుతోంది ఆ తల్లి. వీళ్లూ పనికి వెళ్లలేరు. వాళ్లందరినీ కామాక్షమ్మనే పోషిస్తోంది. ఇళ్లకు పోయి పాచి పని చేసి... దేవాలయాల దగ్గర ప్రసాదాలు తెచ్చి 8 మంది ఆకలి తీరుస్తోంది.

ఎనిమిదేళ్ల కూతురు. ఆరేళ్లు లోపువయస్సు ఉన్న ముగ్గురు మనవళ్లు. వీరు చలిలో ఆ ఇంట్లో పడుకోవడానికి నరకయాతన అనుభవిస్తున్నారు. సొంత ఇళ్లు ఇస్తే... పాచిపనులు చేసుకొని బతుకుతామని వేడుకుంటున్నారు. సంపాదించి, పిల్లల ఆలనాపాలనా భుజానవేసుకున్న అత్తను చూసి... కోడళ్లు చలించి పోతున్నారు. కానీ ఏం చేయాలేని పరిస్థితి. ప్రభుత్వం దయతలచి తమను ఆదుకోవాలని... పిల్లలను చదివించుకుంటామని దీనంగా అడుగుతోంది ఈ కష్టాలమ్మ. ఆశగా వచ్చిపోయే వాళ్ల వైపు చూస్తోందీ ఆ కుటుంబం.

అయ్యో పాపం అనేవారే.. సాయం చేసేవారేరి?

ఇదీ చదవండి: తేగలు... రుచినే కాదు జీవనోపాధినీ ఇస్తున్నాయ్..!

Last Updated : Dec 4, 2019, 11:58 PM IST

ABOUT THE AUTHOR

...view details