ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు లారీలు ఢీ...ఒకరు మృతి - one died in road accident at nellore

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోలగట్ల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన మరో లారీ...ఒకరు మృతి

By

Published : Aug 22, 2019, 12:16 PM IST

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన మరో లారీ...ఒకరు మృతి
నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన సంఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. చిల్లకూరు నుంచి సిలికా లోడ్​తో బెల్గాం వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ అవ్వటంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మత్తు చేస్తున్న సమయంలో బొగ్గు లోడుతో వస్తున్న మరో లారీ వెనుక నించి బలంగా ఢీ కొట్టిడంతో బొగ్గు లారీ డ్రైవర్ క్యాబిన్​లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details