నెల్లూరు జిల్లా రాజుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కొడవలూరు మండలం గమేషా ఫ్యాక్టరీ సమీపంలో ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో విజయవాడకు చెందిన రంజిత్ కుమార్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతడి భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
కారు బోల్తా పడి ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు - రాజుపాలెం కారు యాక్సిడెంట్ న్యూస్
కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా రాజుపాలెం వద్ద జరిగింది.
కారు బోల్తా పడి వ్యక్తి మృతి