ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్ అదుపుతప్పి ఒకరు మృతి.. కారు ఢీకొని మరొకరికి తీవ్ర గాయాలు - రోడ్డు ప్రమాదాలు నెల్లూరు జిల్లా

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనలు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో జరిగాయి.

road accident
బైక్ అదుపుతప్పి ఒకరు మృతి.. కారు ఢీకొని మరొకరికి తీవ్ర గాయాలు

By

Published : Jan 17, 2021, 10:12 PM IST

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం రాఘవరెడ్డిపల్లి, నర్రావాడ వద్ద జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాచవారిపల్లి గ్రామానికి చెందిన ఉప్పలపాటి రమణారెడ్డి(59) ద్విచక్ర వాహనంపై దుత్తలూరు వస్తున్నాడు. రాఘవరెడ్డిపల్లి వద్దకు వచ్చేసరికి వాహనం అదుపుతప్పింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆత్మకూరుకు తరలించి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

మరో ప్రమాదంలో ఏరుకొల్లు గ్రామానికి చెందిన డీలర్ చవల మాలకొండయ్య భార్య నాగేంద్రమ్మతో కలిసి వడ్డెపాలెంలోని బంధువుల వద్దకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. నర్రవాడ వద్ద ప్రకాశం జిల్లా పామూరు వైపు నుంచి వస్తున్న కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. మాలకొండయ్యకు తీవ్రగాయాలవడంతో వైద్యం కోసం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. రోడ్డు ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:కాలనీ పేరు మార్చారని.. మంత్రి ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details