నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఎస్. మునికుమారి అనే మహిళ వినూత్నంగా తన శివభక్తిని చాటారు. మూడేళ్లలో ఏకంగా కోటి వొత్తులు తయారుచేశారు. కార్తిక మాసంలో కోటి వత్తులు వెలిగించాలని మూడేళ్ల క్రితం సంకల్పించారు. అప్పటి నుంచి ఇంట్లో పనులు ముగియగానే వొత్తుల తయారీకి ఉపక్రమించేదానిని అని తెలిపారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని శ్రీకాశీవిశ్వేర స్వామి ఆలయంలో 200 పెద్ద ప్రమిదల్లో వీటిని ఉంచి హారతి ఇస్తామని ఆమె తెలిపారు.
ముక్కంటికి కోటి వత్తులు - నెల్లూరు జిల్లాలో కోటి వత్తులు తయారు చేసిన మహిళ
శివునిపై భక్తితో ఓ గృహిణి మూడేళ్ల నుంచి ఒత్తులు తయారు చేస్తూ.. కార్తీకమాసం అరంభం రోజున కోటి దీపాలతో హారతులు ఇచ్చేందుకు నిర్విరామంగా కష్టపడింది. సోమవారం సాయంత్రం పట్టణంలోని శ్రీకాశీవిశ్వేర స్వామి ఆలయంలో 200 పెద్ద ప్రమిదల్లో వీటిని ఉంచి హారతి ఇస్తామని ఆమె తెలిపారు.
one crow