నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం కుర్జాగుంట అటవీ పరిధిలో అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. లక్షలన్నర విలువచేసే 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వాసులుగా అటవీశాఖ రేంజ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వ్యక్తులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరిపారని అన్నారు. పెనుగులాటలో తుపాకీని వదిలి వ్యక్తి పరారయ్యాడని.. నిందితుని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లక్షన్నర విలువ చేసే ఎర్రచందనం పట్టివేత
నెల్లూరు జిల్లా కుర్జాగుంట అటవీ పరిధిలో సంబంధిత శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. లక్షలన్నర విలువచేసే 8 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
లక్షన్నర విలువచేసే ఎర్రచందనం పట్టివేత