ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్ లో కొనసాగుతున్న రియల్ భూమ్.. మరోసారి భూముల వేలానికి నోటిఫికేషన్ - AP NEWS LIVE UPDATES

HMDA notification for land auction: తెలంగాణ రాష్ట్రంలో గతంలో హెచ్​ఎండీఏ ఈ-వేలం ప్రక్రియకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు మళ్లీ నిధుల సమీకరణ కోసం మరోసారి భూముల వేలానికి నోటిఫికేషన్ జారీ చేసింది. 300 గజాల నుంచి 10 వేల గజాల విస్తీర్ణం గల ప్లాట్లకు వేలం నిర్వహించనుంది.

హెచ్‌ఎండీఏ
hmda

By

Published : Dec 21, 2022, 7:08 PM IST

HMDA notification for land auction : తెలంగాణ రాష్ట్రంలో భూముల వేలానికి మరోసారి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. భారీ ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్... రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలోని భూముల అమ్మకం చేపట్టింది. 300 గజాల నుంచి 10 వేల గజాల విస్తీర్ణం గల ప్లాట్లకు వేలం నిర్వహించనుంది. వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ గడువు జనవరి 16గా నిర్ణయించారు. జనవరి 4,5,6 ప్రి బిడ్ సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి 18న హెచ్‌ఎండీఏ భూములకు వేలం వేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details