నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మరోసారి చేతబడి కలకలం సృష్టించింది. పడుగుపాడు గ్రామంలో మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు క్షుద్ర పూజలు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల పెద్ద బొమ్మ వేసి కోళ్లను బలివ్వగా, మూడు రోజుల క్రితం చేతబడి చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తాజాగా ఈ రోజు అదే ప్రాంతంలో క్షుద్రపూజలు చేయడం స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గులు వేసి, పసుపు, కుంకుమ, పూలు, నిమ్మకాయలతో, గుర్తుతెలియని వ్యక్తుల బట్టల ఉంచి చేతబడి చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడు నెలల వ్యవధిలో నాలుగుసార్లు క్షుద్ర పూజలు.. - క్షుద్ర పూజలు తాజా వార్తలు
మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు క్షుద్ర పూజలు జరగడంతో నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో పడుగుపాడు గ్రామస్థులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పూజలు జరిగిన కొంతదూరంలో ఓ జంతువును బలి ఇచ్చి మూటకట్టిపడేయడం, ఓ బైక్ ను వదిలి వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మూడు నెలల వ్యవధిలో నాలుగుసార్లు క్షుద్ర పూజలు
ఇవీ చూడండి...:మద్యం దుకాణం మూసివేయాలని మహిళల ఆందోళన