Old Woman Missing in Nellore : మాండౌస్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో కోవూరు మండలం వేగూరు కాలువలో రామనాథపురానికి చెందిన వృద్ధురాలు బుజ్జమ్మ (65) గల్లంతైంది. వృద్ధురాలు పడిపోవడాన్ని గుర్తించిన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ తెలియలేదు. ఓ పక్క వర్షం కురుస్తుండటం,.. మరోపక్క చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.
వేగూరు కాలువలో వృద్ధురాలు గల్లంతు.. ఇంకా లభించని ఆచూకీ - Nellore District latest news
Mandaus Typhoon Old Women Missing In Nellore : మాండౌస్ తుఫాన్ ప్రభావంతో ఉదృతంగా కురిసిన భారీ వర్షాలకు నిండుగా ప్రవహిస్తున్న వేగూరు కాలువలో నెల్లూరు జిల్లా రామనాథపురానికి చెందిన 65 ఏళ్ల బుజ్జమ్మ అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా వృద్ధురాలు ఆచూకీ తెలియలేదు.
తుఫాన్