ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నవాళ్లకు బరువయ్యారు... ఊరోళ్లు వద్దన్నారు! - parents pain in lockdown

చిన్నప్పుడు కంటికిరెప్పలా చూసుకున్న తల్లిదండ్రులు పెద్దయ్యాక.. ఆ పిల్లలకు భారమయ్యారు. కడుపున ఏడుగురు సంతానం పుట్టినా...వృథ్యాప్యంలో ఏ ఒక్కరూ తోడుగా నిలవలేకపోయారు. అనారోగ్యంతో బాధపడుతుంటే అవతలకుపోమ్మంటూ గెంటేసింది ఆ కుమార్తె. వైద్యం చేయించే స్థోమత లేక స్థిమితంగా ఉండిపోయాడా కొడుకు. చేసేదేమీ లేక మనవడు ఆ అవ్వాతాతను సొంతూరికి తీసుకెళ్తున్నా అని చెప్పి... క్వారంటైన్ కేంద్రంలోనే వదిలేశాడు. మనవడు తప్పిపోయాడేమో అని... అమాయకులైన ఆ వృద్థ దంపతులు చీకట్లో వెతుకులాటకు దిగారు.

old parents facing problems in lockdown even they have big family in nellore dst
old parents facing problems in lockdown even they have big family in nellore dst

By

Published : Jun 8, 2020, 11:02 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామానికి చెందిన నేలటూరు దేవదాసు, నేలటూరు పిచ్చమ్మ దంపతులకు మొత్తం ఏడుగురు సంతానం. వ్యవసాయ కూలిగా ఉంటున్న దేవదాసు తన శక్తి కొలది పిల్లలను పెంచి పెద్ద చేసి వారికి వివాహాలు చేశారు. పొంగూరు గ్రామంలోనే ఉంటున్న దేవదాసు దంపతులు లాక్ డౌన్ కు రెండు నెలలు ముందుగా చెన్నైలోని కుమారుని వద్దకు వెళ్లారు. చెన్నైలో ఉండగా మూత్ర సంబంధిత వ్యాధితో దేవదాసు అనారోగ్యం పాలయ్యాడు.

అతనికి వైద్య పరీక్షలు అందించేందుకు.. అక్కడ ఉన్న కుమారునికి అదే ప్రాంతంలో నివసిస్తున్న కుమార్తెకు భారంగా మారింది. దేవదాసును సొంత గ్రామానికి పంపించేందుకు నిర్ణయించుకుని గ్రామంలో ఉండే ఇతని రక్త సంబంధీకులు సమాచారం ఇచ్చారు...వాళ్లు అంగీకరించలేదు. తాతయ్య అమ్మమ్మ పడుతున్న బాధను చూడలేక చెన్నైలో ఉన్న మనవడు వెంకటేశ్వర్లు వీరిని కారులో తీసుకుని సొంత గ్రామం పొంగూరులో వదిలేందుకు బయలుదేరాడు. దేవదాసు దంపతులు వస్తున్న సమాచారాన్ని స్థానిక వీఆర్వో వాలంటీర్లకు చెప్పి... చెన్నై నుంచి వస్తున్నందున గ్రామానికి రావొద్దని.. ఆత్మకూరు వైద్యశాల వద్ద ఉండాలని చెప్పారు.

వారి మాటలు నమ్మి ఆత్మకూరు క్వారంటైన్ సెంటర్ లో దాదాపు మూడు గంటల పాటు నిరీక్షించినా... అధికారులు ఎవరు రాలేదు. ఊరికి తీసుకెళ్లేందుకు అయిన వాళ్ళు ఒప్పుకోని కారణంగా.. చెన్నైకు తీసుకుపోవడానికి వీలు లేక ఆత్మకూరులోని క్వారంటైన్ సెంటర్ వద్దే ఈ వృద్ధ దంపతులను వదిలి మనవడు వెంకటేశ్వర్లు తిరిగి చెన్నైకి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని వృద్థ దంపతులు తన మనవడు తప్పిపోయాడనుకుని... అతడి కోసం బైపాస్ రోడ్ సెంటర్ నుంచి రెండు కిలోమీటర్లు నడిచి ఆత్మకూరు చేరుకున్నారు. విషయం తెలుసుకుని స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డికి సమాచారం ఇవ్వగా.. ఈ వృద్ధ దంపతులను ఆత్మకూరు వైద్యశాలలో చేర్చారు.

ఇదీ చూడండి:

రసాయనాలపై నిషేధం సరే- ప్రత్యామ్నాయం ఏది?

ABOUT THE AUTHOR

...view details