ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం: ఆసుపత్రిలోనే కరోనా రోగి ఆత్మహత్య - నెల్లూరు జీజీహెచ్ న్యూస్

నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో విషాదకర ఘటన జరిగింది. కరోనా చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు.. కట్టుకున్న చీరతోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

covid patient suicide
ఆత్మహత్యకు పాల్పడిన కరోనా బాధితురాలు

By

Published : Sep 7, 2020, 1:05 PM IST

Updated : Sep 7, 2020, 2:06 PM IST

నెల్లూరు జీజీహెచ్​లోని కొవిడ్ కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మూలపేట ప్రాంతానికి చెందిన పరమేశ్వరమ్మ కొన్ని రోజుల క్రితం పాజిటివ్​తో ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న ఆమె... చీరతో... ఇనుప కమ్మీకి ఉరివేసుకుంది.

ప్రభుత్వాసుపత్రిలోనే ఈ ఘటన జరగటంతో చర్చనీయాంశమైంది. కరోనా సోకినప్పటి నుంచి ఆగకుండా వాంతులు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీని వల్లే ఆమె భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:పనుల కనికట్టు..అవినీతి గుట్టురట్టు

Last Updated : Sep 7, 2020, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details