విషాదం.. పసిపాప, వృద్ధురాలి ఉసురు తీసిన లిఫ్ట్ - నెల్లూరు
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని భార్గవి హైట్స్ అపార్ట్మెంట్లో ప్రమాదం.. ఇద్దరిని బలి తీసుకుంది.
పసిపాప, వృద్ధురాలి ఉసురు తీసిన లిఫ్ట్
By
Published : Apr 3, 2019, 5:52 PM IST
పసిపాప, వృద్ధురాలి ఉసురు తీసిన లిఫ్ట్
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని భార్గవి హైట్స్ అపార్ట్మెంట్లో ప్రమాదం.. ఇద్దరిని బలి తీసుకుంది. లిఫ్ట్ ఎక్కుతుండగా జారిపడి వృద్ధురాలు, ఆమె చేతిలో ఉన్న ఓ పసిపాప మృతి చెందారు. కేవలం రోజుల వయసే ఉన్న ఆ చిన్నారి.. ప్రమాదం కారణంగా విగతజీవిగా మారింది. ఆ పసికందును చూసి కట్టలు తెంచుకున్న తల్లిదండ్రుల దు:ఖాన్ని ఆపతరం కాలేదు.