ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

24 గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి - 24 గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి

24 గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మరణించిన విషాదకర ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటుచేసుకుంది. ఎండతీవ్రతతో పాటు అనారోగ్యం కారణంగా వారు మరణించినట్లు స్థానికులు తెలిపారు.

24 గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి
24 గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి

By

Published : May 29, 2020, 10:54 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విషాదం చోటుచేసుకుంది. ఎండ తీవ్రతతో పాటు అనారోగ్యం కారణంగా 24 గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు తనువు చాలించారు. హైదరాబాద్​కు చెందిన రామారావు, భారతి భార్యభర్తలు. వారు గత కొంత కాలంలో వెంకటగిరిలో ఇళ్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. పేదరికం కారణంగా గత రెండు నెలలుగా కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్నారు.

ఆరోగ్యం సరిగా లేకపోవటంతో గురువారం భారతిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. శుక్రవారం ఆమె భర్త రామారావు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. వారి మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, పోలీసుల సహకారంతో వీరి అంత్యక్రియలను నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details