అమృత హస్తం పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, 3 ఏళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు మధ్యాహ్నం వేళ పౌష్ఠికరమైన భోజనాన్ని అందిస్తారు. అయితే ఉదయగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు పౌరసరఫరాల శాఖ అధికారులు కాలం చెల్లిన వంట నూనె సరఫరా అయ్యింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలస్యంగా మేల్కొన్న అధికారులు
ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారు ప్రాజెక్టు అధికారి ఈస్టర్ రాణి. సమస్యను ఉదయగిరి తహశీల్దార్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. చౌక దుకాణాన్ని పరిశీలించి కాలం చెల్లిన వంట నూనె ప్యాకెట్ల సరఫరా అవుతున్నట్లు వారు నిర్ధారించారు. వెంటనే అప్రమత్తమయ్యారు. వాటి స్థానంలో కొత్త ప్యాకెట్లను సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు.. కాలం చెల్లిన నూనె ప్యాకెట్ల స్థానంలో కొత్త ప్యాకెట్లు సరఫరా చేశారు.
ఇదీ చదవండి:
నిజం దాస్తున్నారు...గుట్టుగా అమ్మేస్తున్నారు!