నెల్లూరు జిల్లా రెడ్డిగుంట గ్రామంలో భూముల రీ సర్వేను అధికారులు ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ హరేంద్రప్రసాద్, సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం చేపట్టిందన్నారు.
ఈ కార్యక్రమాన్ని గూడూరు డివిజన్ పరిధిలో ప్రారంభించామని సంయుక్త కలెక్టర్ హరేంద్రప్రసాద్ తెలిపారు. 2021 జులై నాటికి జిల్లాలోని నాలుగు వందల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేసి... ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రేపు గ్రామంలో భారీ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.