నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో పులివర్ది కొండమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆమె అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న వీఆర్వో ఉదయ్ భాస్కర్, కార్యదర్శి రమణరావు, ఏఎన్ఎమ్ నాగమణి మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వంతో వారు చేసిన పనిని మండల అధికారులు, ప్రజలు అభినందించారు. అనారోగ్యంతో మరణించిన మహిళ పట్ల కనికరం లేకుండా బంధువులు వ్యవహరించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
అధికారులే ఆప్తులై.. అంత్యక్రియలు నిర్వహించి - కామిరెడ్డిపాడు తాజావార్తలు
కరోనా.. మనుషుల నడుమ బంధాల్ని తెంచేస్తోంది. కరోనాతో మరణించిన వారికే కాదు.. అనారోగ్యంతో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకూ జనం ముందుకు రావటం లేదు. నెల్లూరు జిల్లా కామిరెడ్డిపాడులో మరణించిన మహిళకు అధికారులే ఆప్తులై.. అంత్యక్రియలు జరిపించి, మానవత్వం చాటుకున్నారు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు