ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధిక ధరలకు సరకులు విక్రయించేవారిపై కేసులు - 5 cases on big bazar

నెల్లూరులో తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అధిక ధరలకు విక్రయించినా, డిస్కౌంట్ల పేరుతో వినియోగదారులను ఆకర్షిస్తూ మోసగించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.

nellore  district
అధిక ధరలకు సరుకులు విక్రయించేవారిపై వేటు

By

Published : May 31, 2020, 7:30 AM IST

నెల్లూరులో తూనికలు కొలతల శాఖ అధికారులు.. బిగ్ బజార్ మాల్ లో దాడులు చేసి 5 కేసులు నమోదు చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ థామస్ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.

అసలు ధరకు, అమ్మకపు ధరకు తేడా ఉన్నట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. రాయితీల పేరుతో ఆకర్షిస్తూ మోసగిస్తున్న వారి పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details