Office Subordinate Shirisha protest at MPDO Office: నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేటర్ శిరీషకు చేదు అనుభవం ఎదురైంది. ఎంపీడీవో స్వరూప రాణి తీరును నిరసిస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తనను ఎంపీడీవో చిన్నచూపు చూస్తున్నారని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ కన్నీరు పెట్టుకున్నారు. వరికుంటపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఏడేళ్లుగా ఆఫీస్ సబార్డినేటర్గా పత్రి శిరీష పనిచేశారు. జూన్ 30న సాధారణ బదిలీల్లో భాగంగా ఆమెను వింజమూరు ఎంపీడీవో కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
'ఎమ్మెల్యే, జడ్పీ సీఈవోను కలిసి వస్తేనే.. జాయిన్ చేసుకుంటానన్నారు' - వింజమూరు ఎంపీడీవోపై ఆఫీస్ సబార్డినేటర్ శిరీష ఆరోపణలు
Vingamur mpdo office News: నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీడీవో స్వరూప రాణి.. తనను డ్యూటీలో జాయిన్ చేసుకోవడంలేదని ఆఫీస్ సబార్డినేటర్ శిరీష ఆరోపించారు. ఎమ్మెల్యే, జడ్పీ సీఈవోను కలసి వస్తేనే.. తన జాయినింగ్ లెటర్ తీసుకుంటానని ఇబ్బంది పెడుతున్నారని కార్యాలయం ఎదుట శిరీష కన్నీరు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో రిలీవింగ్ లెటర్, జాయినింగ్ లెటర్‌తో ఎంపీడీవో స్వరూప రాణిని కలవగా.. జాయినింగ్ లెటర్ తీసుకోవడానికి నిరాకరించిందని శిరీష తెలిపారు. భర్త లేని మహిళగా నన్ను ఎంపీడీవో చిన్న చూపు చూస్తూ.. నిందలు వేసి జాయిన్ చేసుకోవడంలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, జడ్పీ సీఈవోను కలసి వస్తేనే.. జాయినింగ్ లెటర్ తీసుకుంటానని ఎంపీడీవో అంటున్నారని ఆరోపించారు. ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: