ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెచ్​ఐవీ బాధితులు, ఒంటరి మహిళలకు పౌష్టికాహారం అందజేత - nutritious food for HIV victims news

సమాజం పట్ల ప్రతీ ఒక్కరు బాధ్యతగా ఉండాలని నెల్లూరులోని NNP+ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ధనుంజయ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని హెచ్​ఐవీ బాధితులు, ఒంటరి మహిళలకు పౌష్టికాహారం అందించారు.

ఒంటరి మహిళలకు పౌష్టికాహారం
ఒంటరి మహిళలకు పౌష్టికాహారం

By

Published : Mar 8, 2022, 8:57 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని NNP+ (Nellor Network Of People Living With HIV/Aids) వారి ఆధ్వర్యంలో హెచ్​ఐవీ బాధితులు, ఒంటరి మహిళలకు పౌష్టికాహారం పండ్లు, ధాన్యం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్​జీవో ప్రతినిధులు.. సమాజం పట్ల ప్రతీ ఒక్కరు బాధ్యతగా ఉండాలన్నారు. కష్టాల్లో ఉన్నవారిని మానవతా ధృక్పథంతో ఆదుకోవాలని సూచించారు. తద్వారా మెరుగైన సమాజం నిర్మితమవుతుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో డీఎల్​వో రమాదేవి, NNP+ అధ్యక్షుడు ధనుంజయ, గుత్తి విజయ్ కుమార్, స్వర్ణలత, కొండపనాయుడు, మంజుల, ఇతర ఎన్​జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : CM Jagan: మహిళలకు 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details