నెల్లూరు జిల్లాలో రైతుల బతుకు భారంగా మారింది. మూడేళ్లుగా సరైన వర్షాల్లేక పొలాలు బీళ్లుగా మారాయి. అప్పులు చేసి బోర్లు వేసినా చుక్కనీరు పడని దుస్థితి నెలకొంది. ఉదయగిరి, కలిగిరి, వింజమూరు ప్రాంతాల్లో.... అన్నదాతల పరిస్థితి మరీ దయనీయం. పశువులకు నీరు, గ్రాసం దొరక్క తెగనమ్ముకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వరిగడ్డి తెద్దామన్నా... దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరవుతో జిల్లాలో రెండొంతులకుపైగా సాగు తగ్గింది. దీనివల్ల ఎండుగడ్డి కొరత ఏర్పడింది. కొంతమంది మూగజీవాలను దూరప్రాంతాలకు తోలుకుపోతుండగా... మరికొందరు అమ్మేస్తున్నారు. కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గి... తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి.