కరోనా వైరస్ దరి చేరనీయకుండా అపరిశుభ్రతతో రోజూ యుద్ధం చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. మరోవైపు అరకొర సదుపాయాలు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక భయాలతోనూ పోరాడుతున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో ఉదయం 5 గంటల నుంచే 1300 మంది కార్మికులు సైనికుల్లా పని చేస్తున్నారు. అయితే తమకు రక్షణ పరికరాలు, కిట్లు లేవని వారు వాపోతున్నారు. విధుల్లో వారు ఎదుర్కొంటున్న కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజారావు అందిస్తారు.
కరోనా యోధులకు రక్షణ కరవు - ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ సైనికుల్లా పోరాడుతున్నారు పారిశుద్ధ్య కార్మికులు. లాక్డౌన్తో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైనా... వారు మాత్రం నిత్యం విధులకు హాజరవుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందిస్తోన్న కార్మికుల రక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రక్షణ పరికరాలను సైతం అందించటం లేదు.
Sanitation workers