బాణాసంచా మోతలతో దద్దరిల్లే దీపావళి పండుగ...కరోనాతో కళ తప్పింది. నెల్లూరు జిల్లాలో మెుదట టపాసులపై నిషేధం విధించిన అధికారులు...తర్వాత షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. పర్యావరణానికి హాని చేయని టపాసులను రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కాల్చుకునేందుకు అధికారులు సమ్మతించారు. అయినా...వినియోగదారులు టపాసులు కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. ఏటా రద్దీగా ఉండే దుకాణాలు నేడు వెలవెలబోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ధరల్లో మార్పులు లేకున్నా...కరోనా కారణంగా అమ్మకాలు తగ్గాయని వ్యాపారస్తులు అంటున్నారు.
కళతప్పిన దీపావళి...వెలవెలబోతున్న బాణాసంచా దుకాణాలు - నెల్లూరులో బాణాసంచా విక్రయాలు
కరోనా కారణంగా ఈ ఏడాది దీపావళి పండగ కళ తప్పింది. ఏటా రద్దీగా ఉండే నెల్లూరులోని టపాసుల దుకాణాలు వినియోగదారులు లేక నేడు వెలవెలబోతున్నాయి. బాణాసంచా అమ్మకాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని వ్యాపారస్తులు అంటున్నారు.
![కళతప్పిన దీపావళి...వెలవెలబోతున్న బాణాసంచా దుకాణాలు కళతప్పిన దీపావళి...వెలవెలబోతున్న బాణాసంచా దుకాణాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9534761-677-9534761-1605265023234.jpg)
కళతప్పిన దీపావళి...వెలవెలబోతున్న బాణాసంచా దుకాణాలు