'Anandayya : ఆనందయ్యతో కలెక్టర్ భేటీ.. ఇంటింటికీ ఔషధ పంపిణీ' ఆనందయ్య ఔషధాన్ని వికేంద్రీకరణ విధానంలో పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఆనందయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి చేర్చే ఆలోచన చేస్తున్నామన్నారు. దూరప్రాంతాల వారికి కొరియర్ ద్వారా ఔషధం అందిస్తామన్నారు. మందు వృథా కాకుండా ఆధార్ కార్డు ద్వారా పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. అప్పటి వరకు ఎవరూ కృష్ణపట్నం రావద్దంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఆన్లైన్ పద్ధతిలోనూ..
అనంతరం మందు పంపిణీ కోసం తీసుకోవాల్సిన ఏర్పాట్లుపై పాలనాధికారి సమీక్షించారు. వికేంద్రీకరణ పద్ధతి, ఆన్లైన్ ద్వారా మందులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ చక్రధర్ తెలిపారు. ఈ మేరకు వచ్చే సోమవారం నుంచి ఔషధ పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించారు. మరోవైపు మందు తయారీకి సమయం ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో కృష్ణపట్నంలో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం గ్రామంలోని పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రతినిధి రాజారావు మరిన్ని వివరాలు అందిస్తారు.
ఇవీ చూడండి :Anandaiah : ఔషధ తయారీని త్వరలోనే ప్రారంభిస్తాం: ఆనందయ్య