ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫ్రిజ్​లు, టీవీలు మీ మాట వింటాయ్..! - ఫ్రిజ్​లు, టీవీలు మీ మాట వింటాయ్!

సాంకేతికత ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉంది. ప్రతి పనిని ఎంతో సులభతరం చేసేస్తుంది. తాజాగా ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు మన మాట వినే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది నెల్లూరు జిల్లా శేశ్రిత సంస్థ.

new technology to on and off with eather net in nellore
ఫ్రిజ్​లు, టీవీలు మీ మాట వింటాయ్!

By

Published : Dec 28, 2019, 5:50 PM IST

ఫ్రిజ్​లు, టీవీలు మీ మాట వింటాయ్!

ఆఫీస్​కు టైమ్​ అయిపోయింది. ఇంట్లో పని ముగించుకొని త్వరత్వరగా బస్ ఎక్కేశారు. అప్పుడే గుర్తొచ్చింది... టీవీ కట్టేయలేదని, ఫ్రిజ్​ డోర్ సరిగ్గా వేయలేదని. ఏం ఫర్వాలేదు... ఈథర్ నెట్ ఇంట్లో ఉంటే. అసలు ఏంటి ఈ ఈథర్ నెట్..? అని అనుకుంటున్నారా. తెలుసుకుందాం రండి.

చప్పట్లు కొడితే లైట్లు ఆగి వెలగటం పాత పద్ధతి. కేవలం నోటి మాట ద్వారా లైట్లు, ఫ్యాన్లు మన మాట వినటం ఇప్పటి పద్ధతి. అవునండీ శేశ్రిత టెక్నాలజీ సంస్థ ఈ సాంకేతకతను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ ఉన్న వైఫై టెక్నాలజీకి బదులు దేశంలోనే మెుదటి సారిగా ఈథర్ నెట్ సాంకేతికత ద్వారా స్మార్ట్ హోమ్​ను తీర్చిదిద్దనున్నారు. నోటి మాట ద్వారా ఈథర్ నెట్ టెక్నాలజీని ఉపయోగించి ఇంట్లో మనం లేకుండా లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్ వంటి వాటిని ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీతో రేడియేషన్​ ప్రభావం ఉండదని శేశ్రిత టెక్నాలజీ ఎండీ వివరించారు.

ఇదీ చదవండి: 'తోలుబొమ్మలాట కళను ప్రోత్సహించండి'

ABOUT THE AUTHOR

...view details