నెల్లూరు జిల్లాలో కూలీలు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక వలస కూలీలంతా వారి స్వస్థలాలకు చేరుకున్నారు. జిల్లాలో రైతులు రబీ సీజన్ నడుస్తున్నందున.. నార్లు పోసి పొలాలను సిద్ధం చేసి ఉంచారు. గతంలో నాట్లు వేసేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూలీలు నాట్లు వేసేందుకు వచ్చేవారు... ప్రస్తుతం ఆ పరిస్థతి లేనందున ఒక ఎకరా భూమిలో నాట్లు వేసేందుకు రూ.3వేలు ఖర్చు అయ్యేది. ప్రస్తుతం రూ.7వేలు చెల్లించినా కూలీలు దొరకని పరిస్థితి. కూలీలు దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక నారుమడులను అలాగే వదిలేస్తున్నారు.
కూలీలు లేరు నాట్లు ఎలా? - నెల్లూరు రైతుల కష్టాలు
నెల్లూరు జిల్లాలో రైతులకు నాట్లేసేందుకు కూలీలు దొరక్క అవస్థలు పడుతున్నారు. రెట్టింపు డబ్బు ఇస్తామన్నా ఎవరూ రాని పరిస్థితి. దీంతో చేసేది లేక నారుమడి అలానే వదిలేస్తున్నారు.
వదిలేసిన నారుమడులు