ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో కోలుకున్న కరోనా సోకిన వ్యక్తి - నెల్లూరులో కోలుకున్న కరోనా సోకిన వ్యక్తి

నెల్లూరులో కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడిందని జిల్లా కలెక్టర్​ శేషగిరి బాబు తెలిపారు. రాష్ట్రస్థాయి వైద్య అధికారులతో సంప్రదించి అతన్ని డిశ్చార్చి చేస్తామని అన్నారు. వైరస్​ వ్యాప్తి కాకుండా పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు కలెక్టర్​ చెప్పారు.

nelore carona affected person recovered
కరోనా చర్యలపై మాట్లాడుతున్న నెల్లూరు జిల్లా కలెక్టర్​

By

Published : Mar 20, 2020, 12:03 PM IST

కరోనా చర్యలపై మాట్లాడుతున్న నెల్లూరు జిల్లా కలెక్టర్​

నెల్లూరులో కరోనా వైరస్​ సోకిన వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు తెలిపారు. పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం.. రాష్ట్రస్థాయి వైద్య అధికారుల సంప్రదించి అతని డిశ్చార్జిపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం నెల్లూరులో ఐదుగురు ఐసోలేషన్ వార్డులో ఉండగా.. 793 మంది హోం ఐసోలేషన్​లో ఉన్నారని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 125 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేసినట్లు చెప్పారు.

పూర్తి అప్రమత్తంగా ఉన్నాం

ఒంగోలులో గుర్తించిన కరోనా పాజిటివ్ వ్యక్తి ప్రయాణించిన బస్సులో 16 మంది నెల్లూరుకు వచ్చినట్లు సమాచారం వచ్చిందన్నారు. వీరిలో ప్రస్తుతం ఆరు మంది మాత్రమే నెల్లూరులో ఉండగా, మిగిలిన వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లడంగాని, ప్రయాణాలు రద్దు చేసుకోవడంగాని చేసి ఉండొచ్చని చెప్పారు. నెల్లూరులో ఉన్న ఆరుగురిని హోమ్ ఐసోలేషన్​లో ఉంచి పరిశీలిస్తున్నామన్నారు. కరోనా వైరస్ నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి అప్రమత్తతతో ఉందని కలెక్టర్​ శేషగిరి తెలిపారు. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు, ఇతర ఏ కార్యక్రమాలు పెట్టుకోవద్దని సూచించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మూడో కరోనా కేసు... అధికారులు అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details