నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను కొవిడ్ ఆసుపత్రిగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు అందుబాటులోకి తెస్తున్నారు. 600 బెడ్స్ కొవిడ్ బాధితుల కోసం కేటాయించారు. నెల్లూరు , అనంతపురం, కడప జిల్లాల్లోని బాధితులకు పూర్తి సేవలు ఇక్కడే అందిస్తారు. జిల్లాలో 2, 200 బెడ్స్‌ను కరోనా వైరస్ అనుమానితుల కోసం అందుబాటులోకి తెస్తున్నారు. మరిన్ని వివరాలపై.. మా ప్రతినిధి రాజారావు సమాచారం అందిస్తారు.
కొవిడ్ ఆసుపత్రిగా నెల్లూరు జీజీహెచ్ - నెల్లూరు జీజీహెచ్‌ను ప్రభుత్వం కోవిడ్ ఆసుపత్రిగా మార్చింది
నెల్లూరు జీజీహెచ్‌ను ప్రభుత్వం కొవిడ్ ఆసుపత్రిగా మార్చిన నేపథ్యంలో... నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలకు ఇక్కడి నుంచే సేవలు అందించనున్నారు. దీని కోసం జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు 600 పడకలను సిద్ధం చేశారు.

కోవిడ్ ఆసుపత్రిగా నెల్లూరు సర్వజన ఆసుపత్రి