Anam Ramanarayana Reddy Serious Comments: గత కొద్ది రోజులుగా నెల్లూరు రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్, వైసీపీ బహిష్కృత నేత ఆనం రామనారాయణ రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తే ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతానని అనిల్ కుమార్ యాదవ్ సవాలు విసిరాడు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారో స్పష్టత లేదని తెలిపిన ఆయన.. 2024 ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డికి నెల్లూరు నగరం నుంచి పోటీ చేసే దమ్ము ఉందా అంటూ అనిల్ కుమార్ సవాల్ విసిరారు. ఈ పోటీలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు, లోకేశ్‌ను పట్టుకుని తెలుగుదేశం నేతలు కలల కంటున్నారని అనిల్ కుమార్ ఎద్దేవా చేశాడు. వైసీపీ టికెట్‌పై గెలిచి పదవికి రాజీనామా చేయకుండానే జగన్ ను దూషించటం అర్ధరహితమన్నారు.
లోకేశ్ పాదయాత్రకు వస్తున్న స్పందనను ఓర్చలేకే.. ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. లోకేశ్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కొందరు తమ అక్కసు వెల్లగక్కుతున్నారని ఆయన నెల్లూరులో మండిపడ్డారు. పాదయాత్ర చూసి వణికిపోతు ఎం మాట్లాడాలో అర్దం కావడం లేదన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాలు కలుషితమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. బూతుపురాణాలు వినలేక ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మీ పార్టీ నేత ఇంటర్వూ ఇవ్వకపోతే, ఇక్కడకి వచ్చి ఎదోఎదో మాట్లాడటం సమంజసంకాదన్నారు. ప్రతిపక్షాలన్ని ఏకమై ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు నడుం బిగించాయని చెప్పారు.