Nellore Wrestlers Won Medals in National Level:అహోరాత్రులు కష్టపడుతూ విజయం సాధించాలనే తపనతో వారంత కుస్తీ సాధన చేస్తున్నారు. ప్రతిభ ఉన్నా సరైన సదుపాయాలు లేక అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోతున్నారు. పేదరికం కారణంగా ఈ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికల వరకు వెళ్లలేక ఆగిపోతున్నారు. పరిస్థితి గమనించిన కోచ్, అకాడమీ వ్యవస్థాపకులు ఈ యువకులను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు.
నెల్లూరుకు చెందిన కుస్తీ వీరులు సాధన చేస్తూ.. ఇంటర్, డిగ్రీలు చదువుతున్నారు. వీరందరికి క్రీడలంటే ఎంతో ఆసక్తి ఉంది. కానీ ఎలా ముందుకెళ్లాలో తెలియని సమయంలో రెజ్లింగ్ ఆట ప్రత్యేకతను తెలియజేశాడు కోచ్ ప్రేమ్‌కుమార్. పైగా ఆటల్లో రాణిస్తే ఉద్యోగాల్లో అవకాశాలు వస్తాయని.. కోచ్‌పై నమ్మకంతో సాధన చేస్తూ ముందుకు సాగారు ఆ యువకులు.
మొదట్లో శిక్షణ కేంద్రం అందుబాటులో లేక మట్టిలో కుస్తీలు నేర్చుకున్నారు. కానీ వీరి ఆసక్తిని చూసి కోచ్ శ్రీవాసులు.. తన శిక్షణ కేంద్రంలో కుస్తీలు పట్టేందుకు అవకాశం కల్పించాడు. ఈ అవకాశంతో ప్రస్తుతం సింహపురి స్పోర్ట్స్ ఆథారిటిలో శిక్షణ పొందుతున్నారు. అయితే ఆసక్తి ఉన్న యువకులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామంటన్నారు రెజ్లింగ్ కోచ్.
"నేను నెల్లూరు జిల్లాకు రెజ్లింగ్ కోచ్‌గా పని చేస్తున్నాను. ఈ ఆట వల్ల ఉద్యోగ సాధనలో 2శాతం రిజర్వేషన్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రతిఒక్కరికి దీనివల్ల ఉద్యోగం, విద్య వంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది." -ప్రేమ్‌కుమార్, రెజ్లింగ్ కోచ్
కుస్తీపై యువకులు చూపిస్తున్న ఆసక్తిని గమనించి నాయుడు పేట, వెంకటగిరి పట్టణాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రస్తుతం 60 మందికి పైగా యువకులు ఈ స్పోర్ట్స్ ఆథారిటీలో శిక్షణ పొందుతున్నారు. ఇందులో 20 మందికి పైగా రెజ్లర్లు పథకాలను సాధించారు. చదువుతో పాటు శారీరక దృఢత్వాన్నిపెంచుకునేందుకు ఆటలు ఆడుతోన్నట్లు చెబుతున్నారు ఈ కుస్తీవీరులు.
Asia Games 2023 : ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు!.. ఏకంగా పాక్ కెప్టెన్సీ బాధ్యతలు.. ఎవరబ్బా ఈ అక్రమ్?
"మాది మారుముల గ్రామం నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి రెజ్లింగ్ ఆటలో శిక్షణ తీసుకుంటున్నాను. నేను 2015 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐదు జాతీయ క్రీడలలో పాల్గొన్నాను. వాటిలో పతకాలు సాధించాను." -సి.హెచ్ హరి, కుస్తీ క్రీడాకారుడు