ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుమారు 180 కిలోమీటర్లు వెళ్లి... పింఛన్ అందజేసిన వాలంటీర్ - nellore district latest news

నెల్లూరు నగరం లే క్యూ కాలనీ సచివాలయ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. అనార్యోగంతో చెన్నైలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుని వద్దకు వెళ్లి పింఛను అందజేశారు. సిబ్బంది ఉదారతను పలువురు కొనియాడారు.

volunteer donated a pension at chennai
సుమారు 180 కిలోమీటర్లు వెళ్లి పింఛన్ అందజేసిన వాలంటీర్

By

Published : Feb 2, 2021, 7:07 PM IST

నెల్లూరు నగరంలోని లే క్యూ కాలనీలో నివాసముంటున్న అరుణాచలం(75).. గుండె సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మూడు నెలలుగా పింఛన్ తీసుకోవడం లేదు. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది సొంత ఖర్చులతో.. వాలంటీర్ రాకేశ్​ను చెన్నైకి పంపి వృద్ధునికి పింఛన్ అందేలా చేశారు. సచివాలయ సిబ్బంది ఉదారతను స్థానికులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details