ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nellore: 'ప్రేమోన్మాదులకు బతికే అర్హత లేదు' - యువతి పై దాడి

ప్రేమోన్మాదులకు బతికే అర్హత లేదని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ వాసిరెడ్డి పద్మ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో జూలై1న ప్రేమోన్మాది దాడికి బలైన యువతి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.

womens commission
వాసిరెడ్డి పద్మ

By

Published : Jul 2, 2021, 7:15 PM IST

నెల్లూరు జిల్లా గూడూరులో జూలై1వ తేదీన యువతిపై ప్రేమోద్మాది చేసిన దాడిని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు. ప్రేమోన్మాదులకు బతికే అర్హత లేదని అన్నారు. చనిపోయిన యువతి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.

ప్రేమించలేదనే కారణంతో చంపే హక్కు అబ్బాయిలకు ఎవరిచ్చారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రేమను తిరస్కరించే హక్కు అమ్మాయిలకు ఉంటుదనే విషయాన్ని అబ్బాయిలు గ్రహించాలన్నారు. పట్టపగలు ఇంట్లోకి వెళ్లి అమ్మాయిని కత్తితో పొడిచి చంపిన వ్యక్తికి బతికే అవకాశం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లకు కచ్చితంగా గుణపాఠం చెప్పేలా తీర్పులు ఉండాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకునే చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:Tragedy: విషాదం : బెట్టింగ్‌తో అప్పుల ఊబిలో చిక్కుకుని దంపతుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details