నెల్లూరు నగరంలో కరోనా వైరస్ బారిన పడిన యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో ఆ వ్యక్తిని జీజీహెచ్ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అనంతరం అతడిని ఇంటికి తరలించారు. బాధిత యువకుడు ఇటలీ నుంచి దిల్లీ మీదుగా చెన్నై విమానాశ్రయానికి చేరుకుని, రోడ్డు మార్గంలో నెల్లూరుకు ఈనెల 6న చేరుకున్నాడు. దగ్గుతో బాధ పడుతుండటంతో ప్రభుత్వ బోధనాసుపత్రిలో చేరాడు. అతని నమూనాలను మొదట తిరుపతి స్విమ్స్‌లో పరీక్షించి కరోనా సోకినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం పూర్తి స్థాయి పరీక్షల కోసం నమూనాలను పుణె పంపగా అక్కడ కూడా పాజిటివ్ తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బాధితుడిని నెల్లూరు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. తాజాగా అతని నమూనాలను పరిశీలించగా నెగెటివ్ రావటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
కరోనా నుంచి కోలుకున్న నెల్లూరు యువకుడు - ఏపీలో కరోనా కేసులు
రాష్ట్రంలో తొలి కరోనా పేషెంట్ అయిన నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు కోలుకున్నాడు. నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుడి నమూనాలను తాజాగా పరిశీలించగా నెగెటివ్ రావటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
carona cases in ap