ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP PROTEST: నెల్లూరులో తెదేపా నేతల గృహనిర్బంధం - నెల్లూరు తెదేపా నిరసనలు

రాష్ట్రంలో తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులను ఖండిస్తూ.. పార్టీ అధినేత చంద్రబాబు నేడు రాష్ట్రబంద్​కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా.. నెల్లూరు జిల్లాలో నిరసన చేపట్టేందుకు నేతలు సిద్ధమయ్యారు. అయితే.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలు చేశారు.

nellore tdp protest
nellore tdp protest

By

Published : Oct 20, 2021, 7:19 PM IST

రాష్ట్రంలో తెలుగుదేశం కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ నెల్లూరు జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు బంద్ చేపట్టాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం వల్లే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అల్లీపురంలో ఆయన నివాసంలో నిరసన తెలుపుతున్న సోమిరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని.. తెదేపా నేత బీదా రవిచంద్ర ధ్వజమెత్తారు.

రవిచంద్రను పోలీసులు నిర్బంధించడంతో ఇంట్లోనే నిరసన చేపట్టారు. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీనివాసులును పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. నెల్లూరులోని మాగుంట లేఔట్‌లోని తన నివాసంలో నిరసనకు దిగిన పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావలిలో రైతు సంఘం నాయకుడు మధుబాబు నాయుడు ఆధ్యర్యంలో ధర్నాకు దిగిన నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఆత్మకూరులో తెదేపా నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయుడుపేటలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details