లాక్డౌన్ కారణంగా హోటళ్లు, బేకరీలు, చిన్నవ్యాపారాలు మూసివేశారని..., వేలాది రూపాయలు విద్యుత్ బిల్లులు ఏ విధంగా వస్తున్నాయని నెల్లూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు బీదా రవిచంద్ర విద్యుత్ అధికారులను ప్రశ్నించారు. విద్యుత్ శాఖ నెల్లూరు జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ఆయన అధికారులకు సమస్యలను వివరించారు. జిల్లాలో అత్యధికంగా వస్తున్న బిల్లులను చూపించారు. విషయాన్ని ఎస్ఈ విజయకుమార్ దృష్టికి తీసుకుపోయారు. బుధ, గురువారాల్లో జిల్లాలోని ఏడీ, డీఈలకు ఈ సమస్యలు వివరిస్తానని ఆయన పేర్కొన్నారు.
'దుకాణాలు మూసేస్తే....బిల్లులు ఎలా పెరుగుతాయి' - నెల్లూరులో తెదేపా నాయకుల ఆందోళన
లాక్డౌన్ సమయంలో సామాన్యులపై విద్యుత్ బిల్లులు భారం మోపుతున్నారని నెల్లూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు బీదా రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయానికి వెళ్లి సమస్యలను అధికారులకు తెలిపారు.
నెల్లూరులో తెదేపా నాయకుల నిరసన