రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని తెదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. పార్టీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టుల ద్వారా భయబ్రాంతులకు గురి చేసినందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల ద్వారా వైకాపాకు గుణపాఠం నేర్పాలి: తెదేపా - వైకాపా అరాచకాలను ఖండించిన నెల్లూరు తెదేపా నేతలు
పంచాయతీ ఎన్నికల ద్వారా వైకాపా అరాచకాలకు తెరదించాలని నెల్లూరు జిల్లా తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోరారు. తెదేపాను బలహీన పర్చాలన్న దురుద్దేశంతోనే పార్టీ నాయకులపై అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఎన్నికల ద్వారా వైకాపా అరాచకాలకు గుణపాఠం నేర్పాలి
ఫోన్లో సామరస్యంగా మాట్లాడిన అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన పోలీసులు.. బహిరంగ దాడులకు పాల్పడుతున్న వైకాపా నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. సినీఫక్కీలో దాడికి పాల్పడ్డ దువ్వాడ శ్రీనివాసులును అరెస్టు చేసి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.