నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. కొత్త ఏడాదిలో ప్రజల రక్షణ, సౌలభ్యం కోసం ప్రధానంగా మూడు విధానాలను అమలు చేసేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. రానున్న మూడు నెలల్లో జిల్లాలో 'ఈ పేపర్' విధానం తీసుకువస్తున్నట్లు చెప్పారు. ప్రజలు పేపర్ ద్వారా ఫిర్యాదు చేసినా, వాటిని తమ సిబ్బంది వెంటనే 'ఈ పేపర్' లోకి మారుస్తారని వెల్లడించారు. 'నిషా' పేరుతో రాత్రి సమయాల్లో మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. 'కవచ్' పేరుతో నెల్లూరు జిల్లాలో పదివేల సీసీ కెమెరాలను 2020 డిసెంబర్ నాటికి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానమిచ్చి... నిఘా పటిష్టం చేస్తామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 2019లో 30 శాతం క్రైమ్ రేట్ తగ్గినట్లు వెల్లడించారు.
'కొత్త ఏడాదిలో ప్రజల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం'
నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ప్రకటించారు. కొత్త ఏడాదిలో ప్రజల రక్షణ, సౌలభ్యం కోసం ప్రధానంగా మూడు విధానాలను అమలు చేసేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు.
మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్