నెల్లూరు జిల్లా అనంతసాగరం పడమటికంభంపాడు ఇసుక రీచ్‌లో పనులు చేసిన కూలీలకు...గుత్తేదారులు వేతనం చెల్లించకపోవడంతో రెండు రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. రెండునెలలకు పైగా పనులు చేయించుకుని... గుత్తేదారు కూలీ చెల్లించలేదని పనులను అడ్డుకున్నారు. రీచ్ వద్ద ఇసుక లారీలు తిరగకుండా రోడ్డుకు గండి కొట్టారు. బకాయిలు చెల్లించేవరకు నిరసనలు తెలుపుతామని. పనులను అడ్డగిస్తామని కూలీలు హెచ్చరిస్తున్నారు.
సోమశిల, పడమటికంభంపాడు గ్రామాలకు చెందిన 500మంది కూలీలు ఇసుక రీచ్‌లో పనిచేశారు. వీరికి సుమారు రూ.25లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రోజూ కూలీ పనులు చేస్తే కాని కడుపునిండదని, తమ శ్రమ దోచుకున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడమటికంభంపాడు రీచ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఐదు ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు.
మా బకాయిలు చెల్లించండి: ఇసుక కూలీలు - నెల్లూరులో బకాయిలు చెల్లించలేదని ఇసుక కూలీల ధర్నా
నెల్లూరు జిల్లా ఇసుక రీచ్‌లో రెండు నెలలుగా కూలీ బకాయిలు చెల్లించలేదని కూలీలు ఆందోళనలు చేశారు. రీచ్‌లో పనులు జరగకుండా రోడ్డుకు గండి కొట్టి పనులను అడ్డకున్నారు.
రోడ్డును తవ్వి పనులను అడ్డుకున్న కూలీలు