ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం' - నెల్లూరులో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా వార్తలు

నెల్లూరు జోనల్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా జోనల్ అధికారులు సిబ్బందిని కుదించే చర్యలు చేపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

nellore rtc employees union dharnaa
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా

By

Published : Dec 21, 2019, 9:12 AM IST

నెల్లూరు జోనల్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. ఉద్యోగుల కుదింపు, ఖాళీల భర్తీలో సాగదీత ధోరణిని నిరసిస్తూ నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుట ఈయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. నెల్లూరు ఆర్టీసీ జోన్ పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఉద్యోగుల సమస్యలపై జోనల్ అధికారికి సమ్మె నోటీసు ఇచ్చామని.. అవి పరిష్కరించకుంటే ఈనెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని యూనియన్ జోనల్ కార్యదర్శి బాబు శ్యామ్యూల్ హెచ్చరించారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా జోనల్ అధికారులు సిబ్బందిని కుదించే చర్యలు చేపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా

ABOUT THE AUTHOR

...view details