తాళం వేసిన ఉన్న ఇళ్లలో దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరితోపాటు... వారికి సహకరిస్తున్న మరో ఇద్దరిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 లక్షల రూపాయలు విలువ చేసే 16 సవర్ల బంగారు ఆభరణాలు, వెండి, పంచలోహ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గూడూరు, వెంకటాచలం పోలీస్ స్టేషన్ ల పరిధిలోని 4 ఇళ్లలో వీరు చోరీలకు పాల్పడినట్లు సీ.సీ.ఎస్. సీ.ఐ. బాజీజాన్ సైదా తెలిపారు. నిందితులు చెన్నైకి చెందిన డేవిడ్, ఘనిమాబాష గా గుర్తించారు. వీరికి గుడూరుకు చెందిన నారాయణమ్మ, బాబు సహకరిస్తున్నట్లు సీఐ తెలిపారు. చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలు పాత నేరస్తులేనని అన్నారు.