Nellore People Suffer with Worst Drainage System : నెల్లూరు నగర కార్పోరేషన్లోని 9 లక్షల మంది ప్రజలకు వర్షం అంటే భయం. చినుకుపడితే కార్పోరేషన్లోని అనేక ప్రాంతాలు మునకకు గురవుతున్నాయి. మురుగుపారుదల వ్యవస్థ సరిగా లేక ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ప్రవహించి చెరువులను తలపిస్తున్నాయని వాపోతున్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా నెల్లూరు పరిస్థితిని మార్చడానికి పాలకులు తీసుకున్న చర్యలు ఏమిటో చేప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగర పరిస్థితి చాలా దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Drainage Situation in Nellore : తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగరం ప్రధాన ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. నగరం నడిబొడ్డులోనూడ్రైనేజీ వ్యవస్థ(Drainage System) సరిగా లేకపోవడంతో నగరవాసులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. మురుగు కాలువల్లో నీరు అంతా బయటకు రావడంతో మురుగు నీటిలోనే నగర ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. గాంధీ బొమ్మ సెంటర్, సండే మార్కెట్, పోగతోటల్లో ఉంటే అసుపత్రుల రోడ్లన్నీ వర్షపు నీటితో మునిగి పోయాయని అంటున్నారు. వర్షపు నీరు మురుగు నీరు రెండు కలసి దుర్గంధంగా మారుతోంది.
Nellore Worst Roads :కార్పోరేషన్లోని కాలనీలు, నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే అండర్ గ్రౌండ్ వంతెనల్లో వర్షపు నీరు ప్రవాహం ఉంటుంది. అటువైపుగా రాకపోకలు చేయలేక ప్రజలు అల్లాడిపోతుంటారు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం డ్రైనేజీ, రోడ్ల వ్యవస్థఅభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్లే అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇళ్ళలోకి కూడా నీరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.