కరోనా ప్రభావంతో రవాణా సౌకర్యాలను ఆపివేయటంతో నెల్లూరు జిల్లాకు చెందిన 30 మంది యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. వీరంతా ఈ నెల 15న కాశీ యాత్రకు వెళ్లి... దర్శనం అనంతరం 23న తిరిగిరావలసి ఉంది. కానీ.. దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్‌తో కాశీలోనే ఇరుక్కుపోయారు. తినడానికి కూడా ఏమీ దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని తమ నివాసాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు. కాశీలో చిక్కుకున్న వారిని తిరిగి తీసుకురావాలని యాత్రికుల కుటుంబసభ్యులు నెల్లూరు జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు.
కరోనా ప్రభావం: కాశీలో చిక్కుకున్న నెల్లూరు యాత్రికులు - కాశీలో చిక్కుకున్న నెల్లూరు వాసులు
నెల్లూరు జిల్లాకు చెందిన 30మంది యాత్రికులు కాశీయాత్రకు వెళ్లి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వారిని తమ నివాసాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు.

కాాశీలో చిక్కుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రికులు
Last Updated : Mar 27, 2020, 3:26 PM IST