peoples facing problems: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మీదుగా రాపూరు మండలానికి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిని చూస్తుంటే చెరువులా కనిపిస్తోంది. దాదాపు 33 కి.మీ. పొడవుండే మార్గంలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల వర్షాలకు వాటిలో నీరు చేరడంతో వాహనదారులు గొయ్యి లోతును అంచనా వేయలేకపోతున్నారు. రోడ్డేదో.. గొయ్యేదో తెలియని ఆ దారిలో ప్రయాణం అంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. నిత్యం ఏదో ఓ చోట వాహనాలు దిగబడుతూనే ఉన్నాయి. పొదలకూరు మండలం ఇనుకుర్తి వద్ద రహదారి దుస్థితిని చిత్రంలో చూడొచ్చు.
road problems: రోడ్డుపై భారీ గుంతలు.. వాహనదారులకు చుక్కలు - telugu news
road damage in nellore: నెల్లూరు జిల్లా పొదలకూరు-రాపూరు మార్గమధ్యలో భారీ వర్షాల కారణంగా రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఈ దారిలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇనుకుర్తి వద్ద గోతిలో దిగబడిపోయింది.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/03-December-2021/13802248_bus.jpg
ఈరోజు ఉదయం పొదలకూరు నుంచి గూడూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇనుకుర్తి వద్ద గోతిలో దిగబడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మార్గంలో ట్రాఫిక్‌ను నియత్రించడం పోలీసులకు సైతం కష్టమైపోయింది. రహదారి దుస్థితి పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:cm jagan tour in kadapa : 'అన్ని విధాలా ఆదుకుంటాం...వరద బాధితులకు సీఎం భరోసా'