వైకాపా ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతూ, సౌకర్యాలు మాత్రం మెరుగుపరచడం లేదని భాజపా ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోయినా పన్నులు మాత్రం విపరీతంగా పెంచారని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు భరత్ కుమార్ విమర్శించారు. నగరంలో చెత్త సేకరణకు పన్ను విధించటం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు. ఇంటి పన్ను, కుళాయి పన్ను కడుతుండగా.. కొత్తగా చెత్తపై పన్ను విధించటమేమిటని ప్రశ్నించారు. నగరంలో పారిశుద్ధ్యం నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, దోమల సమస్య విపరీతంగా ఉన్నా పట్టించుకోవడం లేదని భరత్ కుమార్ ఆక్షేపించారు. సౌకర్యాల గురించి పట్టించుకోకుండా పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపితే కార్పొరేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
'చెత్త సేకరణకు పన్ను విధించడం దుర్మార్గం' - news updates in nellore
నగరంలో చెత్తపై పన్ను విధించటంపై భాజపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు భరత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాలు మెరుగుపరచకుండా, ప్రజలపై భారం మోపాలని చూస్తే ఊరోకోబోమని హెచ్చరించారు.
భాజపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు భరత్ కుమార్