ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే కోటంరెడ్డి ధర్నాలు చేసుకోవడమే: ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి - నెల్లూరు జిల్లా నేటి రాజకీయ వార్తలు

MLA Kotam Reddy: నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలకు తాను అండగా ఉంటానని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.

Nellore MP Adala Prabhakar Reddy
ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

By

Published : Feb 8, 2023, 6:16 PM IST

Updated : Feb 8, 2023, 7:39 PM IST

MLA Kotam Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డిపై నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితకాలం ధర్నాలు చేసుకోవడం తప్ప ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకేమీ చేయలేరని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్​ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

త్వరలోనే అన్ని గ్రామాల్లో పర్యటించి, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రూరల్ గ్రామాల అభివృద్ధికి జిల్లా పరిషత్ తరపున నిధులు కేటాయించిన పనులు జరగకుండా ఎమ్మెల్యే కోటంరెడ్డి అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి ఆరోపించారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి ధర్నాలు చేసుకోవడమే: ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

ఇవీ చదవండి

Last Updated : Feb 8, 2023, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details